తండాల్లో తాగు నీటికి తండ్లాట
దుద్యాల్: తాగునీటి కోసం గిరిజనులకు తండ్లాట తప్పడం లేదు. ప్రభుత్వం బోరు వేయించినా మోటార్‌కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో ఏడాది నుంచి నిరుపయోగంగా గానే ఉంది. చేసేదేమీ లేక తండావాసులు వ్యవసాయ బోర్ల బాటపడుతున్నారు. మండల పరిధిలోని ముచ్చుకుంట తండా, బోయి నగడ్డ తండాల్లో 500 మంది జనాభా నివసిస్తున్నారు. ఇక్కడ తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని పలుమార్లు అధికారులను కోరారు. ఇందుకు స్పందించిన అధికారులు రెండు తండాలకు తాగునీరు అందించేందుకుగాను గత ఏడాది జూలైలో బోరు వేయించారు. తదనంత విద్యుత్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో అది వృథాగా మారింది. వారానికి రెండు రోజులు మాత్రమే సరఫరా అయ్యే మిషన్ భగీరథ నీరు సైతం సరిపడా రావని స్థానికులు వాపోతున్నారు. ఏళ్ల నుంచి తమకు వ్యవసాయ బోర్ల నుంచి నీటి తెచ్చుకోవడం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మోటారు మరమ్మతులు చేయించి విద్యుత్ సౌకర్యం ఏర్పాటు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని గిరిజనం కోరుతున్నారు.
ఏడాది క్రితం బోరు వేయించిన ప్రభుత్వం
విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో అధికారుల అలసత్వం
వ్యవసాయ బోర్లను ఆశ్రయిస్తున్న గిరిజనం
తండాల్లో తాగు నీటికి తండ్లాట


