వెలవెలబోతున్న క్రీడా ప్రాంగణాలు
మోమిన్‌పేట: సరైన పరికరాలు లేక తెలంగాణ క్రీడా మైదానాలు వెలవెలబోతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ప్రాంగణాలు ప్రస్తుతం సూచిక బోర్డులకు మాత్రమే పరిమితమవుతున్నాయి. అప్పట్లో గ్రామీణ ప్రాంతాల్లో యువతి, యువకులు క్రీడలకు దగ్గర చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు. అక్కడ కొన్ని పరికరాలను అమర్చి కొంతకాలం నడిపించారు. కానీ చాలాచోట్ల క్రీడా ప్రాంగణాలు ఊరికి దూరంగా ఉండడంతో కాలక్రమేణ అవి ఆదరణ కోల్పోయాయి. ప్రస్తుతం అందులో ఏలాంటి పరికరాలు లేకుండా పోయాయి.
ఊరికి దూరంగా ఏర్పాటు
మండల పరిధిలోని 28 గ్రామ పంచాయితీ పరిధిలో క్రీడా ప్రాంగాణాలను ఏర్పాటు చేశారు. చాలాచోట్ల గ్రామాలకు దూరంగా విసిరేసినట్లు ఉండటం, పరికరాలు లేకపొవడంతో కేవలం బోర్డులకే పరిమితమయ్యాయని యువకులు పేర్కొంటున్నారు. ఏ ఒక్క మైదానంలో ఆటలు ఆడటం లేదని చెబుతున్నారు. ఏన్కతలలో గ్రామానికి కిలోమీటరు దూరంలో బోర్డు పెట్టి వదిలేశారు. దీంతో యువకులు ప్రాంగణంలో క్రీడా పరికరాలు లేకుండా ఎలా వదిలేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉన్నాతాధికారులు స్పందించి పరికరాలు అమర్చాలని కోరుతున్నారు. మరోవైపు క్రీడ ప్రాంగణాల బిల్లుల నగదు ఇప్పటికీ అందలేదని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరికరాలు లేక శిక్షణకు ఇబ్బంది
పట్టించుకోని అధికారులు


