నిబద్ధతతో పనిచేయాలి
అనంతగిరి: ఇటీవల వైద్యులుగా, యంఎల్‌హెచ్‌పీలుగా విధులు చేపట్టిన వారంతా సకాలంలో హాజరై పేద ప్రజలకు సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వెంకటరవణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ అందిస్తున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పేద ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే సదుద్యేశంతో పల్లె దవాఖానాలో వైద్యులను నియమించారన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప వైద్యాధికారులు డాక్టర్ జీవరాజ్, రవీంద్ర, పవిత్ర, బుచ్చిబాబు, జానీ, నిరోషా తదితరులు పాల్గొన్నారు.


