సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
కుల్కచర్ల: కుల్కచర్ల, చౌడాపూర్ మండలాలతో పాటుగా వికారాబాద్ జిల్లాకు సాగునీరు అందించేందుకు లక్ష్మీదేవిపల్లి ఎత్తిపోతల పథకం కోసం నిధులు కేటాయించడం అభినందనీయమని డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ మొగులయ్య, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, యువజన విభాగం అధ్యక్షుడు జంగయ్య, మండల ఉపాధ్యక్షు డు హరినాథ్‌రెడ్డి, నరసింహనాయక్, ఎస్టీ సెల్ జి ల్లా అధ్యక్షుడు శివరాములు, ఎస్టీ సెల్ మండల అ ధ్యక్షుడు రాంచందర్, నాయకులు శ్రీను, తుకానాం, కృష్ణయ్య, అమృతయ్య తదితరులు పాల్గొన్నారు.


