స్వయం సేవకులు పెరగాలి
ఆర్‌ఎస్‌ఎస్ వక్తి, విభాగ్ సహకార్య వాహ సూర్యనారాయణ మూర్తి
పరిగి: స్వయం సేవకుల సంఖ్య పెరగాలని ఆర్‌ఎస్‌ఎస్ వక్తి, విభాగ్ సహకార్య వాహ సూర్యనారాయణ మూర్తి అన్నారు. ఆదివారం పరిగి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వందేళ్లలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో పరిగి ఖండ సంఘ్ చాలక్ కె.బ్రహ్మయ్య ఆధ్వర్యంలో మాధవ శాఖ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఆర్‌ఎస్‌ఎస్‌తోనే వ్యక్తి పరివర్తన సాధ్యమవుతుందన్నారు. దేశ వ్యాప్తంగా శాఖ కార్యక్రమాల ద్వారా హిందూ సమాజంలో సమరసత, అనుశాసనం, శీల నిర్మాణం జరుగుతుందన్నారు. స్వయం సేవకుల ద్వారా నిర్వహించబడే వేలాది విద్యాలయాలు, అన్ని క్షేత్రాల్లోని లక్షలాది సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయని చెప్పారు. దీంతో సంఘం పట్ల సంపూర్ణ సమాజం యొక్క విశ్వసం పెరుగుతుందని తెలిపారు. స్వయం సేవకుల సంఖ్య పెరిగే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి గోపాల్, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


