
తపాలా కార్యాలయంలో ‘ఆధార్’
కొడంగల్ రూరల్: పట్టణంలోని తపాలా కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఆధార్ కౌంటర్‌ను ప్రజలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తపాలా సిబ్బంది కోరుతున్నారు. నూతన ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ అనుసంధానం, పేరు, చిరునామా మార్పు, తప్పుల సవరణ, బయోమెట్రిక్‌తో పాటు మరిన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. పేరు, చిరునామా, పుట్టిన తేదీ మార్పులకు అవసరమైన ధృవీకరణ పత్రాలతో కౌంటర్‌లో సంప్రదించాలని సూచించారు. ఈ తపాలా కార్యాలయ సేఊవలు మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోకి వస్తాయన్నారు.
ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసిన ఉన్నతాధికారులు
సద్వినియోగం చేసుకోవాలి
పట్టణంలోని తపాలా కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆధార్ కౌంటర్‌ను ప్రజలు వినియోగించుకోవాలి. తపాలా కార్యాలయాల్లో సేవలు విస్తరించేందుకు శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
– ఎస్.విజయజ్యోతి, తపాలాశాఖ పర్యవేక్షకులు, మహబూబ్‌నగర్ జిల్లా

తపాలా కార్యాలయంలో ‘ఆధార్’