కోటి కుటుంబాలకు ‘కేసీఆర్‌ బీమా’ | Sakshi
Sakshi News home page

కోటి కుటుంబాలకు ‘కేసీఆర్‌ బీమా’

Published Sat, Nov 25 2023 4:34 AM

-

గ్యారెంటీలను నమ్మి మోసపోవద్దు

బీఆర్‌ఎస్‌ చేవెళ్ల అభ్యర్థి కాలె యాదయ్య

షాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే కోటి కుటుంబాలకు కేసీఆర్‌ బీమా వర్తింపజేస్తామని.. అసైన్డ్‌ భూములు అమ్ముకునేందుకు రైతులకు హక్కులు కల్పిస్తామని బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలె యాదయ్య హమీ ఇచ్చారు. శుక్రవారం ఆయన షాబాద్‌ మండల పరిధిలోని నరెడ్లగూడ, కుమ్మరిగూడ, పోలారం, పోతుగల్‌, లక్ష్మారావుగూడ, వెంకమ్మగూడ, మక్తగూడ, రేగడిదోస్వాడ, తిర్మలాపూర్‌, ఏట్ట ఎర్రవల్లి, తిమ్మారెడ్డిగూడ గ్రామాల్లో షాబాద్‌ జెడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదారి పట్టించేందుకే కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల హమీనిచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ను నమ్మితే వందేళ్లు వెనక్కి పోతామన్నారు. బీఆర్‌ఎస్‌ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడి పథకాలు అందుతున్నాయా అని ప్రశ్నించారు. రైతుల కష్టాలు సీఎం కేసీఆర్‌కు తెలుసు కాబట్టే.. రైతుబంధు, రుణమాఫీని చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింగ్‌రావు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు శ్రీనివాస్‌గౌడ్‌, నర్సింహారెడ్డి, వెంకటయ్య, టీఎల్‌ఎఫ్‌ జిల్లా లీగల్‌ అడ్వజర్‌ సతీశ్‌రెడ్డి, విశ్వం మాదిగ, సంజీవ, సర్పంచ్‌లు కేతన, మంగమ్మ, ఇస్మత్‌బేగం, అనిత, శ్రీనివాస్‌గౌడ్‌, రాములు, ఎంపీటీసీ సభ్యులు జమ్ముకమ్మ, సునీత, పార్వతమ్మ, అరుణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement