
వికారాబాద్/తాండూరు: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డికి తాండూరు కాంగ్రెస్ టికెట్ ఖరారైంది. శుక్రవారం పార్టీ రెండో జాబితాలో ఆయనకు చోటు లభించింది. ఇటీవలే ఆయన బీఆర్‌ఎస్ వీడి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. పరిగి నియోజకవర్గానికి చెందిన ఆయన అధికార పార్టీలో ఉంటూనే తన సొంత నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ టికెట్ ఆశించారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ కోసం కూడా ప్రయ త్నిస్తూ వచ్చారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో తనకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకున్నారు. పరిగిలో రెండు పార్టీల్లో బలమైన నా యకులు పోటీలో ఉండటంతో అక్కడ టికెట్ రాదని తేలిపోయింది. దీంతో చేసేది లేక తాండూరుపై కన్నేసి.. అనూహ్య రీతిలో హస్తం గూటికి చేరారు. ఆయన ఆ పార్టీలో చేరే నాటికే తాండూరు నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ చా లా మంది కాంగ్రెస్ నేతలు దరఖాస్తు చేశారు.
కేఎల్‌ఆర్ మహేశ్వరం వెళ్లడంతో..
తాండూరు కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేసిన మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డికి అధిష్టానం మహేశ్వరం టికెట్ ఇచ్చింది. దీంతో బీఎమ్మార్ లైన్ క్లియర్ అయింది. మనోహర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరింది మొదలు అంతర్గతంగా అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అండదండలతో సమయస్ఫూర్తిగా వ్యవహరించి.. ఒక్కో సమస్యను అధిగమిస్తూ వచ్చారు. చిన్నాచితకా సమస్యలు మినహా పార్టీ కేడర్‌ను ఒకతాటిపైకి తీసుకురావడంలో ఇప్పటికే సఫలీకృతుడయ్యారు. టికెట్ కూడా రావడంతో ఇక కదన రంగంలో పోరాటానికి సిద్ధమయ్యాడు.
మనోహర్‌రెడ్డి ప్రొఫైల్
అభ్యర్థి పేరు : బుయ్యని మనోహర్‌రెడ్డి
పుట్టిన తేదీ : 05 – 08 –1965
స్వస్థలం : తిర్మలాపురం,
కుల్కచర్ల మండలం
విద్యార్హత : 10వ తరగతి
రాజకీయ ప్రస్థానం : 1987లో టీడీపీలో యువజన నేతగా చేరిక, 1995లో పరిగి నియోజకవర్గ సమన్వయ కమిటీసభ్యుడిగా.., 1996లో డీసీఎంఎస్ డైరక్టర్ రంగారెడ్డి జిల్లా, 2006లో కుల్కచర్ల మండల జెడ్పీటీసీగా 5,300 ఓట్ల ఆధిక్యంతో విజయం
2014లో బీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిగా.., 2020లో కుల్కచర్ల పీఏసీఎస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక. ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.
వ్యాపారాలు: జేబీ ఇన్‌ఫ్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, బీఎంఆర్ సర్త కన్వెన్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ప్రైవేట్ హాస్పిటల్స్ రంగంలో రాణిస్తున్నారు.
తాండూరు టికెట్ ఖరారు
కాంగ్రెస్ రెండో జాబితాలో మనోహర్‌రెడ్డికి అవకాశం
మద్దతుదారులు, కార్యకర్తల్లో జోష్
