నేను వేదాంతపురం పంచాయతీ నుంచి ఎంపీటీసీగా గెలిచి ఐదేళ్లపాటు ప్రజలకు సేవలందించా. నా భర్త చెరకుల జనార్ధన్‌యాదవ్ సైతం సర్పంచ్‌గా పనిచేశారు. 35 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఆయన ఎందరో అభ్యర్థుల నామినేషన్లను సిద్ధం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో సైతం న్యాయవాది సమక్షంలో పకడ్బందీగా నామినేషన్ పత్రాలను తయారు చేయించి దాఖలు చేశాం. అన్నీ సక్రమంగా ఉన్నాయని ఆర్‌ఓ అంగీకరించి చెక్‌లిస్ట్‌లో సంతకం చేశారు. తర్వాత పరిశీలన సమయంలో సాక్షి సంతకాలు లేవని కుంటి సాకులు చెప్పారు. సాక్షి సంతకాలతో సమర్పించిన నామినేషన్ పత్రాల్లో ఒక పేజీని అధికారులే చించివేసి డ్రామా చేశారు. చివరకు అప్పీలుకు వెళ్లినా న్యాయం దక్కలేదు. ఇన్నేళ్ల అనుభవంలో ఇలాంటి దుర్మార్గం ఎప్పడూ చూడలేదు. – చెరకుల కృష్ణవేణి, వేదాంతపురం,
తిరుపతి రూరల్ మండలం
అభినందించి.. తొలగించారు
నేను ఎంపీటీసీ సభ్యురాలిగా ఐదేళ్లపాటు అవిలాల పంచాయతీకి సేవలందించా. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశా. ఒక సీనియర్ న్యాయవాది పర్యవేక్షణలో కంప్యూటర్‌లో నామినేషన్ పత్రాలు సిద్ధం చేయించా. ప్రింట్ తీసుకుని వెళ్లి దాఖలు చేశా. నామినేషన్ల స్వీకరణ సమయంలో అన్ని పత్రాలను ఆర్‌ఓ పరిశీలించారు. చాలా చక్కగా నామినేషన్ తయారు చేశార ని అభినందించారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లు చెక్‌లిస్ట్‌లో సంతకం సైతం చేసి అందించారు. తీరా పరిశీలన సమయంలో నామినేషన్‌ను తిరస్కరించినట్లు డిక్లరేషన్ ఇచ్చారు. ఇదేంటని నిలదీస్తే పోలీసులతో బయటకు నెట్టించారు. ఇంతటి దారుణమైన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు.
–పుట్టా వాణి, అవిలాల, తిరుపతి రూరల్ మండలం
36 ఏళ్లుగా ప్రజలకు సేవ చేస్తున్నా
నేను 1990 నుంచి వివిధ పదవుల్లో ప్రజలకు సేవలందిస్తూ వస్తున్నా. 1990 సింగ్ విండో వైస్ చైర్మన్‌గా, 1995లో పిచ్చినాయుడుపల్లె సర్పంచ్‌ఃగా, 2001లో వైస్ ఎంపీపీగా, 2006లో మరోసారి పిచ్చినాయుడుపల్లి సర్పంచ్‌గా పనిచేశా. దశాబ్దాల అనుభవంతో చంద్రగిరి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశా. ఇప్పటి వరకు నేను దాఖలు చేసిన నామినేషన్లు ఎప్పుడూ తిరస్కరణకు గురికాలేదు. టీడీపీ నేతలతో అధికారులు కుమ్మకై ్క అక్రమంగా నా నామినేషన్‌ను తిరస్కరించారు. ఇలాంటి దుర్మార్గ రాజకీయాలను ఎన్నడూ చూడలేదు.
– బండారు సుధాకర్, చంద్రగిరి


