– 8లో
కొనలేం.. తినలేం
కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని మహిళలు మండిపడుతున్నారు.
అనుభవం ఓడింది.. అరాచకమే తాత్కాలికంగా గెలుపొందింది.. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం చెల్లకుండా పోయింది.. టీడీపీ నేతల గూండాయిజమే రాజ్యమేలింది.. అధికారుల పచ్చపాతంతో ప్రజల ఓటు హక్కు అపహాస్యం పాలైంది. నచ్చిన ప్రజాప్రతినిధిని సైతం ఎన్నుకునే అవకాశం లేని దుస్థితి ఓటర్లకు దాపురించింది. అక్రమ ఏకగ్రీవాలే లక్ష్యంగా అధికార పార్టీ కుతంత్రాలకు వేలాది నామినేషన్లపై తిరస్కరణ వేటు పడింది. పలుమార్లు సర్పంచ్‌లుగా.. ఎంపీటీసీ సభ్యులుగా పనిచేసిన వారికి సైతం ఆర్‌ఓల తిరస్కారమే ఎదురైంది. పకడ్బందీగా పత్రాలు సమర్పించినా ఏకపక్ష వైఖరి ముందు చెల్లుబాటు కాని పరిస్థితి తలెత్తింది. చివరకు ఆర్‌డీఓకు అప్పీలు చేసుకున్నప్పటికీ న్యాయం వృథా ప్రయాసగానే మారింది. రాజ్యాంగబద్ధంగా.. ప్రజాస్వామ్యయుతంగా.. స్వేచ్ఛాయుతంగా నిర్వహించాల్సిన ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పచ్చమూక కనుసన్నల్లోనే నడిచిన దయనీయ స్థితి బాధిత అభ్యర్థుల హృదయాలను కలచివేస్తోంది. – తిరుపతి రూరల్


