నేను గతంలో రెండు పర్యాయాలు పంచాయతీ వార్డు సభ్యుడి స్థానానికి నామినేషన్లు దాఖలు చేశా. అవన్నీ కూడా అధికారుల ఆమోదం పొందాయి. ప్రస్తుతం ఎన్నికల్లో అనుపల్లె పంచాయతీ సర్పంచ్ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశా. ఎన్నికల నిబంధనల మేరకు న్యాయవాది ద్వారా నామినేషన్ పత్రాలను తయారు చేయించా. అన్నీ సక్రమంగా ఉన్నాయని ఆర్‌ఓ సంతకం చేసి మరీ చెక్‌లిస్ట్ ఇచ్చారు. పరిశీలన సమయంలో సాక్షి సంతకాలు లేవని నామినేషన్‌ను తిరస్కరించారు. దాఖలు చేసినప్పుడు ఉన్న సాక్షి సంతకాల పేజీ తర్వాత ఎలా మాయమైందో అధికారులకే తెలియాలి. ఆర్‌డీఓకు అప్పీలు చేసినప్పుడు నామినేషన్ పత్రాల్లో పేజీలను మార్చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఆర్‌ఓ రాసిన ప్రకారం తన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.
– కామసాని సాంబశివారెడ్డి, అనుపల్లె, రామచంద్రాపురం మండలం
●


