ఇలాంటి తిరస్కరణలను ఎన్నడూ చూడలేదు! | - | Sakshi
Sakshi News home page

ఇలాంటి తిరస్కరణలను ఎన్నడూ చూడలేదు!

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

● సర్పంచ్‌, ఎంపీటీసీలుగా పనిచేసిన వారి నామినేషన్లు సైతం బుట్టదాఖలు ● పచ్చపాతంలో వ్యవహరించిన రిటర్నింగ్‌ అధికారులు ● నామినేషన్‌ స్వీకరణ వేళ అన్నీ సక్రమమే అంటూ సంతకాలు ● పరిశీలన సమయంలో కొత్త అభ్యంతరాలు ● అప్పీలుకు వెళ్లినా అభ్యర్థులకు దక్కని ఊరట ● ఆవేదన చెందుతున్న బాధితులు

● సర్పంచ్‌, ఎంపీటీసీలుగా పనిచేసిన వారి నామినేషన్లు సైతం బుట్టదాఖలు ● పచ్చపాతంలో వ్యవహరించిన రిటర్నింగ్‌ అధికారులు ● నామినేషన్‌ స్వీకరణ వేళ అన్నీ సక్రమమే అంటూ సంతకాలు ● పరిశీలన సమయంలో కొత్త అభ్యంతరాలు ● అప్పీలుకు వెళ్లినా అభ్యర్థులకు దక్కని ఊరట ● ఆవేదన చెందుతున్న బాధితులు

వైస్‌ ఎంపీపీగా పనిచేశా..

సుమారు 15 ఏళ్లుగా పలుమార్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నా. 2014లో శానంబట్ల పంచాయతీకి సర్పంచ్‌గా నామినేషన్‌ దాఖలు చేస్తే రాజకీయ కుట్రతో తొలగించేశారు. తర్వాత ఎంపీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందా. తర్వాత వైస్‌ ఎంపీపీగా ప్రజలకు ఐదేళ్లపాటు సేవలందించా. ప్రస్తుతం శానంబట్ల పంచాయతీ సర్పంచ్‌ స్థానానికి నామినేషన్‌ వేశాను. సీనియర్‌ న్యాయవాదికి చూపించిన తర్వాతే మూడు సెట్ల నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశా. ఆర్‌ఓ సైతం అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నాయంటూ సంతకం చేశారు. తర్వాత పరిశీలన సమయంలో మూడు సెట్ల నామినేషన్లను తిరస్కరించారు. ఇది కేవలం రాజకీయ కుట్రే. దీనిపై న్యాయపోరాటానికి చేయడానికి సిద్ధంగా ఉన్నా. – అరగొండ వనజ, శానంబట్ల, చంద్రగిరి మండలం

సుప్రీం కోర్టు ఉత్తర్వుల బేఖాతర్‌

నేను సి.గొల్లపల్లె సర్పంచ్‌గా ఐదేళ్ల పాటు సేవలు అందించా. నా భర్త విడుదల మాధవరెడ్డి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో ఎంపీటీసీగా గెలిచి తొలుత వైస్‌ ఎంపీపీగా పనిచేశారు. తర్వాత ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించి ప్రజలకు విశేష సేవలు అందించారు. ప్రస్తుతం మళ్లీ సి.గొల్లపల్లి పంచాయతీకి సర్పంచ్‌గా నామినేషన్‌ దాఖలు చేశారు. ఆ సమయంలో నామినేషన్‌ పత్రాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని డిక్లకేషన్‌ ఇచ్చారు. ఆ పత్రాల్లో నేను రేషన్‌ షాప్‌ డీలరుని అనే విషయం సైతం పొందుపరిచాం. చివరకు పరిశీలన సమయంలో నామినేషన్‌ను తిరస్కరించారు. దీనిపై ప్రశ్నిస్తే రేషన్‌ షాప్‌ డీలర్‌ పోటీ చేయడానికి వీలు లేదని ఆర్‌ఓ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రేషన్‌ షాపు డీలర్లు పోటీ చేయవచ్చని, గెలిచిన తర్వాత ఏదైనా ఒకటి వదులుకోవాలనే నిబంధన ఉందని సుప్రీం కోర్డు ఉత్తర్వులు చూపించినా పట్టించుకోలేదు. ఆర్‌డీఓకు అప్పీలు చేసినప్పుడు సైతం కోర్టు ఆర్డర్‌ చూపించినా పరిగణనలోకి తీసుకోలేదు.

– విడుదల ప్రభావతి, సి.గొల్లపల్లె, తిరుపతి రూరల్‌ మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement