తిరుపతి సిటీ: శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ కోఆర్డినేటర్‌గా వాణిజ్య శాస్త్ర విభాగం అధ్యాపకురాలు సరితను నియమించినట్టు ప్రిన్సిపాల్ భీమన్న తెలిపారు. సీ్త్ర విద్యను ప్రోత్సహించడానికి కళాశాల నిరంతరం పనిచేస్తుందన్నారు. వివిధ కారణాల వల్ల కళాశాలలకు వెళ్లి చదువుకోవడానికి అవకాశం లేని మహిళలకు దూరవిద్య ద్వారా విద్యను అభ్యసించడం ఒక వరమని పేర్కొన్నారు.
రేపు ఎస్వీయూలో జాబ్ మేళా
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు తెలిపారు. ఇందులో ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఇంటర్వ్యూలు చేస్తారని పేర్కొన్నారు. సుమారు 600 ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు వర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.
టీటీడీ వస్త్రాల ఈ–వేలం
తిరుపతి అన్నమయ్య సర్కిల్ : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన కొత్త న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా ఈ–వేలం వేయనున్నారు. మొత్తం 115 లాట్ల న్యూ ఆర్ట్ సిల్క్ చీరలను ఈ–వేలం ఐడీ నంబర్లు 28814 నుంచి 28819 వరకు వేలం వేయనున్నారు. ఆసక్తి గల బిడ్డర్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ–ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని వేలంలో పాల్గొనవచ్చు. పూర్తి వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ హరేకృష్ణ మార్గ్‌లో ఉన్న జనరల్ మేనేజర్ (వేలములు) కార్యాలయం లేదా ఏఈవో (వేలములు) కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. లేదా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ లేదా 0877–2264429 ఫోన్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని టీటీడీ పేర్కొంది.
జూడోలో ఎస్వీ ఆర్ట్స్
కళాశాల విద్యార్థుల ప్రతిభ
తిరుపతి సిటీ: ఎస్వీయూ అంతర్ కళాశాలల క్రీడా పోటీల్లో భాగంగా గురువారం జరిగిన జూడో పోటీల్లో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు రెండు గోల్డ్ మెడల్స్, మూడు సిల్వర్ మెడల్స్ సాధించి చాంఫియన్స్‌గా నిలిచారు. అలాగే తైక్వాండో పోటీల్లోనూ సత్తా చాటి గోల్డ్ మెడల్ సాధించారు. వారిని ప్రిన్సిపాల్ కిషన్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులను విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పీడీ ఎస్ ముస్తాక్ అహ్మద్, వైస్ ప్రిన్సిపాల్ వై మల్లికార్జున, అధ్యాపకులు పాల్గొన్నారు.


