తిరుపతి సిటీ: విద్యార్థులు అకడమిక్ విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ మాధన్న తెలిపారు. కళాశాలలో గురువారం ఏపీ స్కిల్స్ డెవలప్మెంట్, నాంది ఫౌండేషన్ సంయుక్తంగా సాఫ్ట్ స్కిల్స్‌పై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యంపైనా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రీజినల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ టీ శ్రీనివాసులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


