ప్రజాస్వామ్యంలో ఎన్నికలను ధైర్యంగా ఎదు ర్కోలేక కూటమి నేతలు దౌర్జన్యాలు, దాడులకు దిగారు. కుయుక్తులతో వెంకటగిరి ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూశారు. ఎంపీ గురుమూర్తి ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే అర్ధంతరంగా ఎన్నికను వాయిదా వేశారు. ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి ఎంపీపీ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారు. కూటమి నేతలు ఎన్నికలను ఽధైర్యంగా ఎదుర్కోలేక ఆది నుంచి అక్రమాలు, దాడులకు పాల్పడుతున్నారు. నామినేషన్ల పక్రియలో తమ పార్టీ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారు.
– నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి,
వైఎస్సార్ సీపీ వెంకటగిరి సమన్వయకర్త
టీడీపీ నేతల మెప్పు పొందేందుకే అధికారులు వెంకటగిరిలో ఎంపీపీ ఎన్నికను వాయిదా వేశారు. వైఎస్సార్‌సీపీ సభ్యులను కిడ్నాప్ చేసి శుక్రవారం ఓటింగ్‌కు రాకుండా చేయాలని కుట్ర పన్నారు. వెంకటగిరి మండలంలో 8 ఎంపీటీసీ స్థానాల్లో 4 వైఎస్సార్‌సీపీ, మరో 4 టీడీపీ దక్కించుకున్నాయి. ఎంపీపీ ఎన్నిక టైగా మారింది. అధికారులు లాటరీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. టీడీపీ కీలక నేతల సూచన మేరకు ఆ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు డ్రామా మొదలుపెట్టారు. వాయిదా వేయాలంటూ అధికారులను డిమాండ్ చేశారు. అధికారులు తలూపారు. శుక్రవారం అడ్డదారిలో ఎంపీపీ పీఠాన్ని కై వసం చేసుకునేందుకు ప్లాన్ చేశారు. పోలీసులు మా అభ్యర్థులకు రక్షణ కల్పించాలి.
– మద్దిల గురుమూర్తి, తిరుపతి ఎంపీ


