పుల్లంపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు అడుగడుగునా దౌర్జన్యం చేశారు. దాడులు చేసి గాయపరిచారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వాటిని ఎదుర్కొని ఎన్నికల్లో విజయం సాధించారు. గురువారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికలోనూ కూటమి నేతలు కుయుక్తులు పన్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పలు సమస్యలు సృష్టించారు. చివరి క్షణం వరకూ ఎంపీపీ ప్రమాణ స్వీకారం ఉత్కంఠగానే కొనసాగింది. ఎంపీపీ అభ్యర్థిని అరగ వైష్ణవి కూటమి కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రిటర్నింగ్ అధికారి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఎంపీటీసీ సభ్యులు ఎంపీడీవో కార్యాలయంలోని సభా భవనం నుంచి మెయిన్ రోడ్డు వద్దకు చేరుకోగానే వందలాది మంది కార్యకర్తలు ఎంపీపీకి పూలతో స్వాగతం పలికారు. దారి పొడవునా పూలు చల్లుకుంటూ ఉత్సాహంగా ఆమె వెంట నడిచారు. బాబుల్‌రెడ్డిని కార్యకర్తలు తమ భుజాలపైకి ఎత్తుకొని మోశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు రామిరెడ్డి ధ్వజారెడ్డి, యువ నాయకుడు రంజిత్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, నళినీరెడ్డి, మల్లికార్జునరెడ్డి, సిద్దు, రామనాథం, శంకర్‌రెడ్డి, ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి, రాంబాబు, సారథి, రంగారెడ్డి, ముస్టాక్ తదితరులు పాల్గొన్నారు.


