బైక్‌ను ఢీ కొట్టిన కోళ్ల వ్యాను | - | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీ కొట్టిన కోళ్ల వ్యాను

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

● ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

రాపూరు: ఏర్పేడు– రాపూరు జాతీయ రహదారిలో మంగళవారం ముందు వెళుతున్న బైక్‌ను వెనుక నుంచి వచ్చిన కోళ్ల వ్యాను ఢీ కొట్టడంతో బైక్‌పై వెళుతున్న ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాపూరు మండలం, బండేపల్లి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం.. రాపూరు మండలం, చెల్లటూరుకు చెందిన శివారెడ్డి (35), తాతిపల్లికి చెందిన గోపాల్‌(68) తాతిపల్లి నుంచి డక్కిలి మండలం పలుగోడుకు బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో రాపూరు నుంచి వెంకటగిరి వైపు వెళుతున్న కోళ్లవ్యాను వెనుక నుంచి ఢీకొట్టింది. 108 సిబ్బంది నాగరాజు, అబ్దుల్‌ ఖాదర్‌ ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రును రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించే క్రమంలో శివారెడ్డి మార్గమధ్యంలో మృతిచెందాడు. తీవ్రంగా గాయపడ్డ గోల్‌ను ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement