ఎస్‌ఎంసీ ఎన్నికలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎంసీ ఎన్నికలు పూర్తి

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

● 2,309 పాఠశాలల్లో కమిటీల ఎన్నిక ● కోరం లేక ఏడు పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా

తిరుపతి ఎడ్యుకేషన్‌ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించేందుకు పాఠశాల యాజమాన్య కమిటీ (స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ–ఎస్‌ఎంసీ) ఎన్నికలు ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 2,354 పాఠశాలల్లో ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నికలను జిల్లా విద్యా శాఖ, సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఇందులో 38 పాఠశాలల్లో నిల్‌ అడ్మిషన్‌ కావడంతో మిగిలిన 2,316 పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియను చేపట్టారు. 7 పాఠశాలల్లో కోరం లేక ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాటిలో ఓజిలి మండలంలో ఓజిలి జెడ్పీహెచ్‌ఎస్‌, కరబల్లవోలు ఎంపీపీఎస్‌, చిట్టమూర మండలంలో మెట్టు జెడ్పీహెచ్‌ఎస్‌, తడ మండలంలో ఏపీఎంఎస్‌ తడ, వడమాలపేట మండలంలో తడుకు ఆర్‌ఎస్‌ జెడ్పీహెచ్‌ఎస్‌, వెంకటగిరి మండలంలో కలవలపూడి జెడ్పీహెచ్‌ఎస్‌, చంద్రగిరి మండలంలో తొండవాడ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలల్లో కోరం లేక ఎన్నికలను వాయిదా వేశారు.

ఆసక్తి చూపని ఓటర్లు

కొన్ని పాఠశాలల్లో ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నికలకు తల్లిదండ్రులు ఆసక్తి చూపలేదు. వచ్చిన కొందరితోనే ఎన్నికలను నిర్వహించేశారు. ఎన్నికై న సభ్యులతో చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లను ఎన్నుకుని తొలి ఎస్‌ఎంసీ సమావేశాన్ని నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement