ఆక్రమిత భూమిని చదును చేస్తున్న కబ్జారాయుళ్లు
చంద్రగిరి నియోజకవర్గం, చిన్నగొట్టిగల్లు మండలం, భాకరాపేట రెవెన్యూ గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నం.329లోని ప్రభుత్వ భూమిపై ఆక్రమణదాల కన్ను పడింది. ఇది జాతీయ రహదారికి పక్కనే ఉండడంతో దర్జాగా ఆక్రమించి చదును చేస్తున్నారు. ముడుపులకు అలవాటుపడిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించాల్సి ఉంది.
– భాకరాపేట


