సాంస్కృతిక వైభవం | - | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక వైభవం

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మతల్లి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అలరించాయి. చైన్నె వారి పూల కావిడ, కేరళ డ్రమ్స్‌, దత్తసాయి గురు భరద్వాజ్‌ ఆధ్వర్యంలో మహిళలు నిర్వహించిన కోలాటం ఆకట్టుకుంది. ముందుగా పోలేరమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆర్చి నుంచి నృత్యాలు ప్రారంభించారు. రాజావీధి, కాశీపేట కూడలి, పాత తహసీల్దార్‌ కార్యాలయం సెంటర్‌ వరకు నృత్యాలు సాగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. ఏర్పాట్లను ఎస్‌ఐలు ఖాదర్‌బాషా, స్వరూప పర్యవేక్షించారు. – వెంకటగిరి రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement