జనసేన వార్డు ఇన్‌చార్జి దౌర్జన్యం? | - | Sakshi
Sakshi News home page

జనసేన వార్డు ఇన్‌చార్జి దౌర్జన్యం?

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

● ఇల్లు ఖాళీ చేయాలంటూ మహిళపై దాడి ● హత్యాయత్నం కేసులో ముగ్గురి అరెస్ట్‌

తిరుపతి క్రైం: జనసేన పార్టీకి చెందిన వార్డు ఇన్‌చార్జి సురేష్‌ సహా ముగ్గురు ఇల్లు ఖాళీ చేయాలంటూ ఓ మహిళపై దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతి జిల్లా ఎస్పీ చొరవతో వెస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేసి సురేష్‌తోపాటు ఆనందన్‌, శరవణను అరెస్ట్‌ చేసినట్టు డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. ఈ ఘటన బొమ్మగుంట ఎస్‌బీఐ ఏటీఎం రోడ్డులోని డోర్‌ నం.4–8–84లో ఈ నెల 27న చోటుచేసుకుందని వెల్లడించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కె.రాజేశ్వరిపై ఇంటి యజమాని ఆనందన్‌ (ఏ–1), సురేష్‌ (ఏ–2), శరవణ (ఏ–3)లు ఇంట్లోకి ప్రవేశించి ఇల్లు ఖాళీ చేయాలని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తనపై దాడి చేయడంతోపాటు మొబైల్‌ఫోన్‌, పూల కుండీలు ధ్వంసం చేశారని, తనను బయటకు లాక్కొచ్చి హత్య చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు వెల్లడించారు.

2023 నుంచే వివాదం

ఏ–1 ఆనందన్‌, రాజేశ్వరి భర్త కె.శివప్రసాద్‌ మధ్య 2023 నుంచి ఇంటిని ఖాళీ చేయించే విషయంలో వివాదం కొనసాగుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ వ్యవహారంపై ఆనందన్‌సివిల్‌ కోర్టును ఆశ్రయించగా, కేసు వాయిదాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇరుపక్షాలు గతంలో పోలీసులను కూడా ఆశ్రయించగా, ఇది సివిల్‌ వివాదం కావడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించినట్లు వెల్లడించారు.

కేసు పెట్టొద్దంటూ ఒత్తిళ్లు?

ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయకుండా పోలీసులపై రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్లు బాధితుల వర్గం ఆరోపిస్తోంది. కేసు నమోదు విషయంలో జాప్యం జరుగుతున్న సమయంలో జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా చొరవ తీసుకుని కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో పోలీసులు చర్యలు చేపట్టినట్లు వారు చెబుతున్నారు.

రాజకీయ అండ ఉందంటూ ఆరోపణలు

ఏ–2 సురేష్‌ జనసేన పార్టీకి చెందిన వార్డు ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారని బాధితుల వర్గం చెబుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, బెదిరింపులకు గురిచేశారని వారు ఆరోపిస్తున్నారు. నిందితులకు టీడీపీ ఇన్‌న్‌చార్జి అండదండలు కూడా ఉన్నాయని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement