తలకు గాయమై వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

తలకు గాయమై వ్యక్తి మృతి

Sep 29 2026 1:51 AM | Updated on Sep 29 2026 1:51 AM

రేణిగుంట: మద్యం మత్తులో అదుపు తప్పి వెనక్కి పడిపోవడంతో తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయమై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని శ్రీనివాసపురం, ఆంజనేయస్వామి దేవాలయ సమీపంలో గల కమిటీ హాల్‌ వరండాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా, పెనుమురు మండలం, చిన్నరాజుపల్లికి చెందిన పి.కృష్ణమూర్తి (55) కొంతకాలంగా కరకంబాడి పంచాయతీ, తారకరామనగర్‌లో నివాసముంటూ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి మద్యం సేవించి, శ్రీనివాసపురంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో గల కమిటీ హాల్‌ వరండా వద్దకు వెళ్లాడు. మద్యం మత్తులో అదుపు తప్పి వెనక్కి పడిపోవడంతో తల వెనుక భాగంలో తీవ్ర రక్తగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement