శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శనివారంతో ముగిశాయి. మూలవిరాట్‌లకు పవిత్ర మాలాధరణతో విశేష పూజలు ముగిశాయి. ఆలయప్రధాన అర్చకులు స్వామినాథన్ గురుకుల్ ఆధ్వర్యంలో విశేష పూజాధి కార్యక్రమాలను వేదోక్తంగా నిర్వహించారు. అనంతరం యాగశాల నుంచి పవిత్ర మాలలు విశేష పూజాద్రవ్యాలను ఆలయ ఈవో బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి తొలుత రంగుల గోపురం వద్ద ఉన్న వినాయకునికి పవిత్రమాల సమర్పించారు. అదేవిధంగా ఆలయంలో ఉన్న పరివార దేవతలకు కూడా పవిత్రమాలలు సమర్పించారు. అనంతరం వినాయకుడు, జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామికి పవిత్రమాలలు సమర్పించారు.


