బరితెగిస్తున్న టీడీపీ సోషల్‌ మీడియా | - | Sakshi
Sakshi News home page

బరితెగిస్తున్న టీడీపీ సోషల్‌ మీడియా

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

● రాయలసీమ మేధావుల ఫోరంకో–ఆర్డినేటర్‌ మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి

– 8లో

మాజీ మంత్రి ఆర్కే రోజా తలనీలాలు సమర్పించినట్లుగా తప్పుడు ప్రచారం తప్పుడు పోస్టులు పెట్టేందుకు జీతాలు ఇచ్చేందుకు క్యాబినెట్‌లో నిర్ణయం వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన ఆగ్రహం

ఘనంగా సతీష్‌ ధవన్‌ జయంతి
షార్‌ కేంద్రంలో సతీష్‌ ధవన్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.

తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ సోషల్‌ మీడియా పైత్యం దుర్మార్గంగా తయారైందని, వాళ్లు మార్ఫింగ్‌ చేసి పెట్టే పోస్టులు వ్యక్తిత్వ హననానికి గురవుతోందని వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో ఆమె తలనీలాలు సమర్పించినట్లుగా టీడీపీ సోషల్‌ మీడియాలో మార్ఫింగ్‌ చేసి పెట్టిన పోస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు ఇది ఒక నిదర్శనమన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామికి ఎంతటి వారైనా తలనీలాలు సమర్పిస్తారని, అయితే తలనీలాలు సమర్పించకపోయినా సమర్పించినట్లు మార్ఫింగ్‌ వీడియోలను టీడీపీ సోషల్‌ మీడియాలో పెట్టి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతోందని మండిపడ్డారు. టీడీపీ సోషల్‌ మీడియాలో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా చూపించుకుంటూ రెండున్నరేళ్లల్లో ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా చంద్రబాబు ఏదో చేసినట్లుగా గొప్పలు చూపించుకుంటున్నారన్నారు. టీడీపీ సోషల్‌ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌కు జీతాలు ఇచ్చేందుకు క్యాబినెట్‌లో నిర్ణయ తీసుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ సొమ్ము ఐటీడీపీ ద్వారా టీడీపీ కార్యకర్తల మేతకు వాడి, తీవ్రమైన వాఖ్యలు, అసభ్య పదజాలం, వ్యక్తిత్వ హననం చేయడానికి సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గులను ఆ భగవంతుడే చూసుకుంటారన్నారు.

మాజీ మంత్రి రోజాపై పోస్టులు

అభ్యంతరకరం

తిరుపతి అన్నమయ్య సర్కిల్‌: మాజీ మంత్రి రోజాపై టీడీపీ సోషల్‌ మీడియాలో పోస్టులు ట్రోల్‌ చేయడం అభ్యంతరకరమని రాయలసీమ మేధావుల ఫోరం కో–ఆర్డినేటర్‌ మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి తెలిపారు. ఇది అత్యంత చట్టవ్యతిరేకమని పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆమెను రాజకీయంగా ఎదుర్కొనే శక్తిలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆమె తిరుమల శ్రీవారి ఆలయం దర్శనానికి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలసి వెళ్లారన్నారు. దీన్ని ఆసరా చేసుకుని మార్ఫింగ్‌ వీడియోలు చేయడం దారుణమన్నారు. మహిళలను చులకన చేసినా, వారిపై అభ్యంతరక పోస్టులు ట్రోల్‌ చేసినా అదే చివరి రోజు అంటూ ప్రకటించిన సీఎం చంద్రబాబు దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధ్యులపై తక్షణం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement