నేడు మత్స్యకారులతో సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు మత్స్యకారులతో సమావేశం

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

తడ: ఆంధ్ర, తమిళనాడు పరిధిలో విస్తరించి, వేలాది మంది మత్స్యకారులకు జీవనాధారంగా ఉన్న పులికాట్‌ సరస్సులో వేట విషయమై శనివారం రెండు రాష్ట్రాల ఉన్నత స్థాయి అధికారులు గుమ్మిడిపూండిలో సమావేశం నిర్వహించనున్నారు. పులికాట్‌ సరస్సులో వేటకు వెళ్లిన సమయంలో సరిహద్దుల్లో ఉండే తమిళ జాలర్లతో తరచూ వివాదాలు నెలకొంటున్నాయి. తాజాగా గురువారం తమ సమస్యను తడ అధికారులకు విన్నవించేందుకు జాలర్లు వెళ్లారు. కానీ వారు అందుబాటులో లేకపోవడంతో తడ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. విషయం తెలుసుకున్న తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ కవితతో చర్చించారు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు శనివారం గుమ్మిడిపూండిలో సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. సమావేశం అనంతరం పులికాట్‌ సరస్సులో సమస్య ఉన్న పళవేర్కాడు ప్రాంతానికి వెళ్లి, పరిశీలించనున్నట్టు సమాచారం

అమరరాజా బెటర్‌వే అవార్డ్స్‌కు దరఖాస్తుల ఆహ్వానం

రేణిగుంట: పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో అమర రాజా గ్రూప్‌ అమర రాజా బెటర్‌ వే అవార్డ్స్‌ 4వ ఎడిషన్‌ను ప్రకటించినట్లు శుక్రవారం యాజమాన్యం వెల్లడించింది. చిన్న పట్టణాల్లో సానుకూల మార్పునకు బాటలు వేస్తున్న ప్రతిభావంతులైన పారిశ్రామికవేత్తలకు గుర్తింపు, ఆర్థిక సహాయం, నిపుణుల మార్గదర్శకత్వాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, గ్రామీణ ప్రతిభకు గుర్తింపు, ఆలోచనలకు అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement