శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా సాగుతున్నాయి. ఆలయంలోని యాగశాలలో పూజలు నిర్వహిచి ప్రాయశ్చిత ఉపచార పూజలు చేశారు. నాలగవ రోజైన శుక్రవారం యాగశాలలో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామినాథన్ ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపి పూర్ణహారతులు సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు పూజాద్రవ్యాలను ఆలయంలో ఊరేగింపుగా ప్రదక్షిణలు చేసి శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తుల వద్దకు విచ్చేశారు. అక్కడ వేదపండితులకు పూజాద్రవ్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో బీకే వెంకటేశులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.


