మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు | - | Sakshi
Sakshi News home page

మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

వెంకటగిరి రూరల్‌: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.50 వేల కోట్లు పైచిలుకు నిధులు కేటాయించినట్టు మున్సిపల్‌శాఖ మంత్రి డాక్టర్‌ పొంగూరు నారాయణ తెలిపారు. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ అధికారులతో ఆయన శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

నిధుల నిర్వీర్యంపై అసహనం

వెంకటగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన రూ.197 కోట్ల నిధులు నిర్వీర్యం కావడంతో మంత్రి మున్సిపల్‌ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమృత 2.0 ద్వారా మంజూరైన నిధులు రూ.104 కోట్లు, ఇత అభివృద్ధి పనులకు రూ.93 కోట్లు మంజూరయ్యాయని, వాటిని సక్రమంగా ఖర్చులేకపోయారని తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలసి అన్నక్యాంటీన్‌ను పరిశీలించి ప్రజలతో కలసి భోజనం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement