రోడ్డు ప్రమాదంలో ఐఐటీ విద్యార్థికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐఐటీ విద్యార్థికి తీవ్ర గాయాలు

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

నాయుడుపేటటౌన్‌: రోడ్డు ప్రమాదంలో ఐఐటీ విద్యార్థి తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం మండలంలోని అయ్యప్పరెడ్డిపాళెం క్రాస్‌ రోడ్డు చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు.. బుచ్చిరెడ్డిపాళెంకు చెందిన పవన్‌కుమార్‌ చైన్నెలో ఐఐటీ చదువుతున్నాడు. మంగళవారం చైన్నె నుంచి తన బైక్‌పై స్వగ్రామానికి వస్తుండగా మార్గమఽధ్యంలో అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ జాతీయ రహదారి కూడలి వద్ద ఓ యాచకుడు అడ్డు రావడంతో బైక్‌ అతనిని ఢీకొంది. ఈ ప్రమాదంలో పవన్‌ కుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే యాచకుడు చెంచయ్యకూ గాయాలయ్యాయి. ఇద్దరినీ 108 అంబులెన్సులో స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పవన్‌ను నెల్లూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement