విద్యుత్‌ స్తంభానికి ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభానికి ఢీకొని వ్యక్తి మృతి

Sep 9 2026 12:11 AM | Updated on Sep 9 2026 12:11 AM

గంగాధరనెల్లూరు:మండలంలోని తూగుండ్రం పంచాయతీ బాల య్య కొత్తూరు వద్ద బైక్‌ అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. పాలసముద్రం మండలం రంగాపురం గ్రామానికి చెందిన గుణశేఖర్‌ మంగళవారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన గుణశేఖర్‌ గంటకు పైగా రక్తస్రావంతో ప్రమాద స్థలంలోనే పడి ఉన్నాడు. స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించినప్పటికీ, సమయానికి రాలేదు. ఆర్తనాదాలు చేస్తున్న క్షతగాత్రుడిని స్థానికులే ఓ ప్రైవేట్‌ వాహనంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. సకాలంలో 108 వచ్చి ఉంటే ప్రాణాలు కాపాడి ఉండవచ్చని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement