తొట్టంబేడు (శ్రీకాళహస్తి రూరల్): శ్రీకాళహస్తి మండలంలోని కమ్మకొత్తూరు గ్రామ చెరువులో మట్టిమాఫి యా తిష్టవేసింది. అక్రమంగా మట్టి తరలిస్తూ జేబులు నింపుకుంటోంది. వారం రోజుల నుంచి పగలు రాత్రి తేడాలేకుండా మట్టి తరలిస్తోంది. జేసీబీ, 30 ట్రాక్టర్ల దాకా పెట్టి చెరువు మట్టిని కొల్లగొడుతోంది. దీంతో చెరువు స్వరూపమే మారిపోతోంది. భవిష్యత్‌లో నీటి నిల్వలు అడుగంటే పరిస్థితులు ఉన్నాయని రైతాంగం ఆవేదన చెందుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత మైనింగ్, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది.


