రేణిగుంట: తిరుమల శ్రీవారి దర్శనం కోసం కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నం భోగాపురం విమానాశ్రయం నుంచి శనివారం మధ్యాహ్నం రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్సీతో పాటు డాక్టర్ బాబు, గంగాధర్, లక్ష్మీకాంత్, మునిశేఖర్, వినాయక, శ్రీను, నాగేంద్ర, లోకేష్, బాలాజీ తదితర నాయకులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్లారు.
ట్యూన్ ఆఫ్ ది టీన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్వీసీఈ కళాశాల అధ్యాపకులు


