తిరుపతి రూరల్: శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో వారం రోజులుగా నిర్వహించిన ‘అగ్రి–టెక్ వితౌట్ బోర్డర్స్’ అంతర్జాతీయ విద్యార్థుల మొబిలిటీ సదస్సు శనివారం ఘనంగా ముగిసింది. ధృతి హాల్‌లో నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో భారత్–మలేషియా విద్యా, సాంస్కృతిక సంబంధాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, హోమ్‌సైన్‌న్స్ విభాగం, మలేషియాలోని యూనివర్సిటీ మలేషియా టెరెంగానూ సంయుక్తంగా పీఎం–ఉషా ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో అంతర్జాతీయ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థులతో పరస్పర చర్చలు జరిపారు. సీఐఆర్‌డీన్‌ప్రొఫెసర్ పి.విజయలక్ష్మి, వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.ఉమ వెన్నెం, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్.ఉషా, పీఎం–ఉషా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ సి.వాణి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విద్యార్థులు, అధ్యాపకులు, అంతర్జాతీయ భాగస్వాములను అభినందించారు. యూనివర్సిటీ మలేషియా టెరెంగానూకు చెందిన డా. మన్నూర్ ఇస్మాయిల్ షేక్ సదస్సును సమన్వయం చేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హోమ్‌సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్.రజని పాల్గొన్నారు.


