టీడీపీ అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తోంది. అయితే ఇప్పటి వరకు చేసింది శూన్యం. సూపర్‌సిక్స్ అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనారు. ప్రతి మహిళ అకౌంట్‌లో రూ.1,500 వేస్తామని చెప్పి మోసం చేశారు. – ఎం.మంజుల,
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య
తిరుపతి కార్యదర్శి
మద్యం ఏరులై పారుతోంది
మద్యం ఏరులై పారుతోంది. భర్త సంపాదించిన కూలి డబ్బులు రోజూ తాగుడుకే తగలేస్తున్నారు. మరోవైపు మద్యం నిత్యం తాగడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి గ్రామంలో 10శాతం మంది వితంతువులుగా మారుతున్నారు. –నాగమ్మ, ఆంధ్రప్రదేశ్
మహిళా సమాఖ్య, రైల్వేకోడూరు కార్యదర్శి


