ఇదేం పాలన చంద్రబాబు? | - | Sakshi
Sakshi News home page

ఇదేం పాలన చంద్రబాబు?

Aug 23 2026 5:32 AM | Updated on Aug 23 2026 5:32 AM

● కలెక్టరేట్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా

తిరుపతి అర్బన్‌: ‘ఇదేం పాలన చంద్రబాబు నాయుడు..?. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోండి స్వామి..’ అంటూ ఆంఽధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య నేతలు మండిపడ్డారు. శనివారం కలెక్టరేట్‌ వద్ద మహిళలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. మహిళా నేతలు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు మీ పాలనలో చేసింది ఏమిటో చెప్పండి అంటూ ప్రశ్నించారు. బియ్యం దగ్గర నుంచి ఉప్పు, పప్పులు, నూనె, గ్యాస్‌, కూరగాయులు, పెట్రోల్‌, డీజిల్‌ అన్ని ధరలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య, మధ్యతరగతి పేద కుటుంబాల జీవనం కష్టంగా మారిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ అమలు కాలేదని, ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తామని చెప్పి మోశం చేశారని ధ్వజమెత్తారు. అనంతరం కలెక్టరేట్‌లోని అధికారులకు వినతిపత్రాన్ని అందించారు. మహిళా సంఘం నేతలు చెంచమ్మ, రత్నమ్మ, విజయా, చారులత, లక్ష్మి, వనిత, దీపిక, సుశీల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement