రేణిగుంట: మండలంలోని మర్రిగుంట చెరువు కట్ట తొలగించినా పట్టించుకునేవారు లేరు. చెరువు భూమితో పాటు చెరువు కట్టను సైతం జేసీబీతో తవ్వేశారు. ఉదయం నుంచి చెరువులో జేసీబీలు పనులు చేస్తున్నాయని స్థానికులు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందించినా అధికారులు పట్టించుకోలేదు. తీరిగ్గా సాయంత్రం 6 గంటల సమయంలో చెరువు వద్దకు చేరుకున్నారు. కట్టను తొలగించే పనులను నిలుపుదల చేసి అక్కడి నుంచి జేసీబీలను పంపించి వేశారు. చెరువు కట్టను అనుమతులు లేకుండా తొలగించిన జేసీబీలు, ప్రైవేట్ వ్యక్తుల పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రైవేట్ వ్యక్తులతో పాటు స్థానిక టీడీపీ నాయకుడు ఉండడం తోనే అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


