డిజిటల్‌ సమ్మిళితే కీలకం | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ సమ్మిళితే కీలకం

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

● లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ గురుమూర్తి

– 8లో

మహిళల సాధికారతకు డిజిటల్‌ సమ్మిళిత కీలకమని యూజీసీ కమిషన్‌ సంయుక్త కార్యదర్శి తెలిపారు.

జాతీయ రహదారులుగా ప్రకటించండి

తిరుపతి మంగళం : తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకోట–సత్యవేడు–తడ రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత కీలకమైన రహదారి ప్రాజెక్టులను తక్షణమే చేపట్టాలని ఆయన సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మూడు రహదారులు తిరుపతి పార్లమెంటు పరిధిలోని పారిశ్రామిక, వ్యవసాయ, వాణిజ్య ప్రాంతాలను అనుసంధానించే కీలక మార్గాలని తెలిపారు. ముఖ్యంగా శ్రీ సిటీ, మేనకూరు సెజ్‌, కృష్ణపట్నం పోర్టుతో అనుసంధానమైన ప్రాంతాల్లో రవాణా అవసరాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు.

ఆరు లేన్లుగా విస్తరించండి

అలాగే నెల్లూరు–చైన్నె జాతీయ రహదారిపై పెరుగుతున్న ట్రాఫిక్‌ను ఎంపీ గురుమూర్తి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణపట్నం పోర్టు నుంచి భారీ సరుకు రవాణా, శ్రీ సిటీ, మేనకూరు సెజ్‌లలో పారిశ్రామిక కార్యకలాపాల విస్తరణ కారణంగా ఈ మార్గంలో వాహనాల రద్దీ గణనీయంగా పెరిగిందని వివరించారు. ప్రస్తుతం ఉన్న నాలుగు లేన్ల రహదారిని ఆరు లేన్లుగా విస్తరించాలని సూచించారు. నెల్లూరు–చైన్నె జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించడంతో పాటు శ్రీకాళహస్తి–తడ, గూడూరు–రాపూరు–రాజంపేట, ఊతుకొట–సత్యవేడు–తడ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించి అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement