నూతన ఆవిష్కరణలపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

నూతన ఆవిష్కరణలపై దృష్టి

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

● ఐఐటీ యువంతర్‌ –2026 కార్యక్రమంలో విద్యార్థులకు సూచించిన డైరెక్టర్‌

● ఐఐటీ యువంతర్‌ –2026 కార్యక్రమంలో విద్యార్థులకు సూచించిన డైరెక్టర్‌

ఏర్పేడు: విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించి విభిన్న ఆలోచనలతో విద్యనభ్యసించాలని తిరుపతి ఐఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌.సత్యనారాయణ పిలుపునిచ్చారు. తిరుపతి ఐఐటీ ప్రాంగణంలో ఐఐటీలో బీటెక్‌ కోర్సుల్లో కొత్తగా చేరిన 251 మంది విద్యార్థులకు యువంతర్‌– 2026 పేరిట అకడమిక్‌ ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఓరి యంటేషన్‌, ఇంట్రడక్షన్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ ఐఐటీలో అమలవుతున్న విద్యా సంబంధిత కార్యక్రమాలు, వసతులు, అకాడమిక్‌ ఓరియంటేషన్‌, స్టూడెంట్‌ సపోర్ట్‌ సెషన్లు, క్యాంపస్‌, డిపార్ట్‌మెంట్‌ సందర్శనలు, వెల్‌నెస్‌ యాక్టివిటీస్‌, ఫ్యాకల్టీతో ఇంటరా క్షన్లు, పూర్వ విద్యార్థుల అనుభవాలు, పరిశోధన అంశాలపై చర్చించారు. అలా గే లైబ్రరీ, సీఐఎఫ్‌ బిల్డింగ్‌, ఐడియా స్క్వార్‌ సందర్శనలు, ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్‌ సెషన్స్‌ జరిగాయి. స్పిక్‌ మెకాయ్‌ ప్రోగ్రాం ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement