జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

తిరుపతి ఎడ్యుకేషన్‌ : జమ్ము అండ్‌ కశ్మీర్‌ రాష్ట్రం, జమ్ముతావిలో జాతీయ కౌన్సిల్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 24నుంచి 26వ తేదీ వరకు జాతీయ స్థాయిలో వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్రం నుంచి క్రీడాకారులు పాల్గొని జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారని రాష్ట్ర కౌన్సిల్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మురళి, మనోహర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో బ్యాడ్మింటన్‌ క్రీడలో డబుల్స్‌ సీనియర్‌ పురుషుల విభాగం నుంచి తేజేంద్ర, హరిప్రసాద్‌లు ప్రథమ స్థానం, మహిళల సింగిల్స్‌ విభాగంలో స్నేహితారెడ్డి ప్రథమ స్థానం, మిక్స్డ్‌ డబుల్స్‌లో హర్షవర్ధన్‌రెడ్డి, స్నేహితారెడ్డిలు ప్రథమ స్థానం, బ్యాడ్మింటర్‌ అండర్‌–14 బాలికల సింగిల్స్‌లో దివ్య ప్రథమ స్థానం, డబుల్స్‌లో సునీత, హారికలు ప్రథమ స్థానం, మిక్సిడ్‌ డబుల్స్‌లో ముక్త, సంజుశ్రీరామ్‌లు ప్రథమ స్థానం, కబడ్డీలో మొదటి స్థానం సాధించి బంగారు పతకం, ఫుట్‌బాల్‌ అండర్‌–14లో తృతీయ స్థానం సాధించి ప్రతిభ చాటారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర క్రీడాకారులను వారు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement