30న జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

30న జాబ్‌మేళా

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

తిరుపతి అర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్ఛేంజ్‌, సీడాప్‌ సంయుక్తంగా నిర్వహించనున్న జాబ్‌ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో తిరుపతి, శ్రీకాళహస్తిలో నిర్వహించనున్న జాబ్‌మేళా పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈనెల 30న శ్రీకాళహస్తిలోని ఎస్‌వీఏ ప్రభుత్వ కాలేజ్‌లో ఉదయం 8.30 గంటలకు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే ఆగస్ట్‌ 3న తిరుపతిలోని ఎస్వీసీసీ డిగ్రీ కళాశాల, బాలాజీ కాలనీలో ఉదయం 8 గంటలకు జాబ్‌ మేళా నిర్వహిస్తామని చెప్పారు. ఆ మేరకు ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ శారదాదేవి, పరిశ్రమలశాఖ జీఎం చంద్రశేఖర్‌, ఏపీఐఐసీ జేఎం విజయభరత్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శోభనబాబు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి లోకనాథం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement