– ముగ్గురి అరెస్ట్
రైల్వేకోడూరు అర్బన్ : అక్రమంగా తరలిస్తున్న 6.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు రూరల్ సీఐ డీ.శ్రీనివాసులు తెలిపారు. నియోజకవర్గంలోని పెనగలూరు మండలం, బెస్తపల్లి గ్రామ సమీపంలో సోమవారం దాడులు నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ దాడుల్లో గంజాయితోపాటు ముగ్గుర్ని అదుపులోకి తీసుకోగా.. ఒకరు పరారయ్యారని తెలిపారు. అరెస్టయిన వారిలో కంచర్ల సుబ్బారెడ్డి, తోడేటి శేఖర్, అజయ్ ఉన్నట్టు తెలిపారు. మరో నిందితుడు సుబ్బరాయుడు పరారీలో ఉన్నాడని, అతనికోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నారు.
అండర్ బ్రిడ్జి వద్ద వ్యక్తి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు బుడుగుంటపల్లికి వెళ్లే రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద సోమవారం నందలూరు మండలం, ఈదరపల్లి దళితవాడకి చెందిన రెడ్యం బాలయ్య (35) మృతి చెందాడు. కోడూరు అయ్యవారిపల్లిలో ఉన్న భార్య శివలక్ష్మితో గోడవ ఉన్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న రైల్వేకోడూరు ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


