తిరుపతి మంగళం : తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని రవాణా వాహనాల యజమానులు ఈనెల 31వ తేదీ లోపు వాహన త్రైమాసిక పన్నులు చెల్లించకుంటే ఆ వాహనాలను సీజ్ చేస్తామని జిల్లా రవాణాశాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ హెచ్చరించారు. తిరుపతి రవాణాశా ఖ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 31వ తేదీ లోపు వాహన త్రైమాసిక పన్నులు సకాలంలో చెల్లిస్తే వారికి ఎటువంటి జరిమానాలు ఉండవన్నారు. వాహన యజమానులు తమ త్రైమాసిక వాహన పన్నును రవాణా శాఖ అధికారిక వెబ్‌సైట్ httpr://vahan.parivahan.gov.in/vahanrervice/ ద్వారా లేదా పరివాహన్ సేవ పోర్టల్‌లో ఆనన్‌లైన్‌లో సులభంగా చెల్లించవచ్చని, ఆన్‌న్‌లైన్ సేవలను వినియోగించి గడువులోపు పన్ను చెల్లించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు జరిమానాలు లేకుండా చేసుకోవచ్చన్నారు. అయితే 31వ తేదీ తర్వాత పన్ను చెల్లించకుండా వాహనం రహదారిపై తనిఖీల సమయంలో పట్టుబడితే, మోటారు వాహన చట్టం ప్రకారం జరిమానాతో పాటు పన్ను వసూలు చేయనున్నట్టు హెచ్చరించారు. ఆగస్టులో తనిఖీ సమయంలో పట్టుబడితే – వందశాతం జరిమానాతో పన్ను వసూలు చేస్తామని, సెప్టెంబర్‌లో పట్టుబడితే రెండ వందల శాతం జరిమానాతో పన్ను వసూలు చేస్తామని స్పష్టం చేశారు.


