రైల్వే స్టేషన్‌కు ఎదుట అసంపూర్తిగా మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్
నిధులు నిలిపి..
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంప్లెక్స్ నిర్మాణానికి తన వాటా నిధులు విడుదల చేయకుండా నిలిపివేసింది. అభివృద్ధి పనులను అడ్డుకుంది. తిరుపతి నగర నడిబొడ్డున స్మార్ట్ సిటీ నిధులతో నిర్మిస్తున్న మల్టీ లెవెల్ పార్కింగ్ భవనాన్ని అడ్డగోలుగా ప్రభుత్వం తన వాళ్లకు కట్టబెట్టేయడం ఇప్పుడు దుమారం చెలరేగింది. ఈ భూమి విలువ రూ.60 కోట్లకు పైగానే ఉంటుంది. చినబాబు సన్నిహితుడుగా చెప్పుకునే కన్యకా ఇన్‌ఫ్రా సంస్థకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం మొత్తం వ్యవహారం నడిపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


