శ్రీసిటీ (వరదయ్యపాళెం) : శ్రీసిటీని పదిమందితో కూడిన బిజినెస్ ఫ్యామిలీ ప్రతినిధి బృందం ఆదివారం సందర్శించింది. ఫ్యామిలీ పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ ఐక్యా కనెక్ట్ ఆధ్వర్యంలో ఈ పర్యటన సాగింది. ప్రస్తుతం ఐక్యా కనెక్ట్‌కు ఆరు దేశాలు, 16 నగరాల నుంచి 85 సింగిల్ ఫ్యామిలీ ఆఫీసులు అనుబంధంగా ఉండగా, ఇవి కలిపి 30 బిలియన్ డాలర్లకు పైగా కుటుంబ పెట్టుబడులను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రతినిధి బృందానికి అట్లాస్ ఫ్యామిలీ ఆఫీస్ చైర్మన్ మెహతాస్, హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సమీర్ మెహతా నాయకత్వం వహించారు. ఈ బృందం శ్రీసిటీలోని మౌలిక వసతులను పరిశీలించింది. ఇప్పటికే ఉన్న పలు కంపెనీల కార్యకలాపాలను తిలకించింది. ఈ సందర్భంగా డాక్టర్ సమీర్ మెహతా మాట్లాడుతూ, తమ పర్యటనకు సహకరించిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఐక్యా కనెక్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్, దినేష్ హిందూజా ఫ్యామిలీ ఆఫీస్ హెడ్ జై రూపానీ మాట్లాడుతూ శ్రీసిటీలో మౌలిక వసతులు బాగున్నాయన్నారు.


