తిరుపతి అర్బన్: అర్హులైన దివ్యాంగులు అందరికీ ఉచిత వాహనాల పంపిణీలో న్యాయం చేస్తామని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వెల్లడించారు. వాహనాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారిలో 70 మంది దివ్యాంగులకు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో మూడు చక్రాల వాహనాలు, స్కూటీలను పంపిణీ చేశారు. జాయింట్ కలెక్టర్ గోవిందరావుతోపాటు తిరుపతి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, బొజ్జల సుధీర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగులు మూడు చక్రాల వాహనాలకు దరఖాస్తులు చేసుకుంటే అర్హతను బట్టి అందిస్తారని వివరించారు. అలాగే అర్హులైన దివ్యాంగులకు రూ.6వేలు, వ్యాధిగ్రస్తులకు రూ.15వేలు పింఛన్ ఇస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు.


