తిరుపతి ఎడ్యుకేషన్:సమగ్ర శిక్ష (ఎస్‌ఎస్)లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఈ నెల 30న చేపట్టే కలెక్టరేట్ ముట్టడిని జయప్రదనం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు గురువారం వారు తిరుపతి అర్బన్ ఎంఈఓలు బాలాజీ, భాస్కర్‌నాయక్‌కు వినతిపత్రం అందించి ముట్టడికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ తిరుపతి జిల్లా చైర్మన్ గండికోట నాగవెంకటేష్ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా సమగ్ర శిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న తమకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఎన్నికల హామీలో భాగంగా తక్షణమే కూటమి ప్రభుత్వం మినిమమ్ టైమ్ స్కేల్‌ను అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమగ్రశిక్ష అభియాన్ సీఆర్‌ఎంటీ యూనియన్ నాయకులు ధనపాల్, వేణుగోపాల్, నవీన్‌కుమార్, జ్యోత్స్న, రమాదేవి, రూపాదేవి, శాలిని, హసీనా, రేఖ పాల్గొన్నారు.


