తిరుపతి అన్నమయ్యసర్కిల్: తమ స్వాధీనానుభవంలో ఉన్న స్థలంపై రాజకీయం చేయడం సరికాదని డాక్టర్ భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుచానూరు సమీపంలో తనపల్లి, నల్లమానికాల్వ గ్రామ లెక్కదాఖలా సర్వే నం.4/2లోఏలో 0.53 సెంట్లు స్థలాన్ని 2008 రామ్‌ప్రసాద్‌రెడ్డి భార్య పి.విజయకుమారి దగ్గర నుంచి తన భార్య బి.రాధిక పేరుపై కొనుగోలు చేశామన్నారు. అప్పటి నుంచి తమ స్వాధీనానుభవంలో ఉందన్నారు. అయితే తమ స్థలానికి ఆనుకొని కొంత పోరంబోకు స్థలం ఉందని, ఆ స్థలాన్ని కూడా తన భార్య రాధికకు 2014 లోనే పి.విజయకుమారి విక్రయపత్రం ద్వారా రాసిచ్చిందన్నారు. కాగా ఈ స్థలంలో తాను ఈనెల 20వ తేదీన కాంపౌండ్ వాల్ నిర్మించుకునే సమయంలో విజయకుమారి భర్త రామ్‌ప్రసాద్‌రెడ్డి, ఆమె కుమారుడు సుజన్‌కుమార్ రెడ్డి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. దీనిపై తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ భూమికి సంబంధించి ఏ పార్టీకి గాని, ఏ రాజకీయ నాయకునికి గానీ సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.


