తిరుమల: తిరుమల శ్రీవారిని గురువారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మైసూర్ రాజ కుటుంబానికి చెందిన డాక్టర్ ప్రమోదదేవి వాడియర్, మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వాడియర్, టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్‌తో పాటు పలువురు ప్రముఖులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లుచేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలను అందజేసి సత్కరించారు.


