డిజిటల్‌ పోర్టల్‌ | - | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ పోర్టల్‌

Jul 24 2026 1:51 AM | Updated on Jul 24 2026 1:51 AM

తిరుపతి అర్బన్‌:ఐటీ హబ్‌ విస్తరణ దిశగా జిల్లా అడు గులు వేస్తోందని, మౌలిక సదుపాయాల అన్వేషణకు పెట్టుబడిదారులు, భూ యజమా నుల మధ్య సమన్వయం చేయాల్సి ఉందని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అందుబాటులో ఉన్న కమర్షియల్‌ భవనాలు, కార్యాలయ స్థలాలు, ఖాళీ భూ ములు, యజమానుల ఆస్తుల వివరాలను ఐటీఐఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ.ఏపీ.జీవోవీ.ఇన్‌ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. అదనపు సమాచారం కోసం జిల్లా ఐటీ మేనేజర్‌ రమేష్‌ 9353494415ను సంప్రదించాలని సూచించారు.

టమాట లారీ బోల్తా

చంద్రగిరి: భాకరాపేట ఘాట్‌ రోడ్డులో గురువారం టమాట లోడుతో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయే క్రమంలో డ్రైవర్‌ లారీపై నియంత్రణ కోల్పోయి పక్కకు రావడంతో బోల్తా కొట్టినట్టు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి ఆస్పత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పింఛన్‌ ఇవ్వమంటే

లంచం డిమాండ్‌ చేశాడు!

– ఇంజినీర్‌ అసిస్టెంట్‌కు షోకాజ్‌ నోటీస్‌

సత్యవేడు: సత్యవేడు పంచాయతీ పరిధిలోని సచివాలయం–4లో పనిచేస్తున్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ అశోక్‌ చక్రవర్తికి ఎంపీడీఓ వెంకటేశ్వర్లు షోకాజ్‌ నోటీసు అందజేశారు. సత్యవేడు పంచాయతీలోని కోమటిగుంటకు చెందిన ఓ వ్యక్తి పక్షవాతానికి గురయ్యాడు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌లో పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. అనారోగ్యానికి గురైన బాధితుడికి పింఛన్‌ వ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఇదిలావుండగా పంచాయతీ పరిధిలోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ అశోక్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడు రోజుల క్రితం పింఛన్‌ ఇవ్వాలంటే కొంత డబ్బు ఇవ్వాలని బాధిత కుటుంబీకులను డిమాండ్‌ చేశాడు. ఆపై బాధిత కుటుంబీకులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీఓ కార్యాలయ ఏఓ త్రివిక్రమారావు, సత్యవేడు సచివాలయ కార్యదర్శి మునిరవికుమార్‌ విచారణ చేపట్టారు. విచారణలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేశాడని బాధితులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌కు షాకాజ్‌ నోటీసు అందజేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement