తిరుపతి ఎడ్యుకేషన్ : ఇటీవల గుంటూరులో 16వ రాష్ట్ర స్థాయి జూనియర్ మెన్ హాకీ చాంపియన్‌షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లాల నుంచి హాకీ జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీల్లో తిరుపతి జిల్లా హాకీ జట్టు అపార ప్రదర్శన కనబరచి తృతీయ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా గురువారం తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ క్రీడా మైదానంలో తిరుపతి జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి క్రీడాకారులను అభినందించారు. రానున్న రోజుల్లో జిల్లా మొదటి స్థానం సాధించేలా కృషి చేయనున్నట్లు జిల్లా కార్యదర్శి ఆదిత్య తెలిపారు. హాకీ అసోసియేషన్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రమేష్‌కృష్ణ, సీనియర్ డీఎస్‌ఏ కోచ్ లక్ష్మీకరుణ, కేఐసీ హాకీ కోచ్ ఎం.అశోక్‌రెడ్డి, సీనియర్ హాకీ క్రీడాకారుడు భీమా, క్రీడాకారులు పాల్గొన్నారు.
జిల్లా హాకీ జట్టు క్రీడాకారులతో
హాకీ అసోసియేషన్ ప్రతినిధులు


