అట్రాసిటీ కేసులకు పరిష్కారం చూపండి | - | Sakshi
Sakshi News home page

అట్రాసిటీ కేసులకు పరిష్కారం చూపండి

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

● సివిల్‌ రైట్స్‌ డే క్రమం తప్పకుండా నిర్వహించాలి ● కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్‌ కమిటీ సమీక్ష

తిరుపతి అర్బన్‌: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి పరిష్కారం చూపాలని కలెక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌ ఆదేశించారు. ఆయన బుధవారం విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వివరించారు. అలాగే సివిల్‌ రైట్స్‌ డే క్రమం తప్పకుండా నిర్వహించాలని చెప్పారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు ఇంటి స్థలాలు, భూ సమస్యలు, బీఆర్‌ అంబేడ్కర్‌ భవన నిర్మాణం తదితర అంశాలకు పరిష్కారం చూపాలని కోరారు. నివాస ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందులో డీఆర్వో నరసింహులు, సత్యవేడు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే లు కోనేటి ఆదివాలం, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీ కళ్యాణ్‌ చక్రవర్తి, అడిషనల్‌ ఎస్సీ శ్రీనివాసులు, డీఎస్పీలు, ఆర్డీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, విభాగాల వారీగా హెచ్‌వోడీలు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement